నీ గురించి నీకు అవగాహన ఉందా Veekshaka.com
ఆరోగ్యం Sep 16, 2026

నీ గురించి నీకు అవగాహన ఉందా? మన ఆలోచనలు, మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడం ఎందుకు అవసరం?

By Krishnam Raj

ప్రతి మనిషి తన ఆలోచనలలో, తన ఎమోషన్స్ లలో, తను ఉన్న పరిస్థితులలో తీవ్రంగా కొట్టుకొని పోతాడు. మళ్ళీ తనే ఇంతల ఎందుకు ఆలోచూస్తున్నాను, ఇంతలా ఎందుకు ఎమోషనల్ అవుతున్న మళ్ళీ మళ్ళీ ఇలాంటి పరిస్థితులనే ఎందుకు తెచ్చుకుంటున్న అని బాధా పడుతాడు. అసలు మనిషికి ఎక్కువగా అలవాటు లేనిది ఏమిటంటే తన పట్ల తనకు అవగాహన లేకపోవడం.

ఎప్పుడూ అవతల వాళ్ల తప్పులు వెతకడం, లేదా తనే తప్పు అని నిందించుకోవడం తనే చిక్కు పరిస్థితులను కల్పించుకొని బాధా పడటం ఎందుకు జరుగుతుంది అంటే తన పట్ల తనకి self awareness అనేది లేక ఎందుకంటే మనషి ఎప్పుడూ తన లోపలికి తను చూసుకోడు,తన స్వభావాన్ని తన ఆలోచనలను తన ఎమోషన్స్ నీ అర్థం చేసుకోక కొంత వరకు చిక్కు పరిస్థితులను తనే కల్పించుకొంటాడు.

అయితే మొత్తంగా తన లోపలికి తను తొంగి చూసుకుని తన ఆలోచనల పట్ల తన మనస్తత్వం పట్ల తన స్వభావం పట్ల తనకి Awareness అనే ఎరుక వస్తే కొంతా వరకు తన నిరాశ, ఆందోళన, గందరగోళం నుంచి బయటపడచ్చు. ఎలాగంటే తన స్వభావాన్ని, మనస్తత్వన్నీ, తన ఆలోచనలను తను అర్థం చేసుకున్నప్పుడు అనవసరమైన ఊహలకు, భయాలకు పోకుండా ప్రజెంట్ కి తగినట్టు తక్షణం లో బ్రతుకుతూ తన ఆలోచనలు తీవ్ర రూపం కాకుండా తన ఆలోచనలను స్థిరం చేసుకుంటాడు.

నీ గురించి నీకు అవగాహన ఉందా Veekshaka.com

తన మనస్తత్వం పట్ల అవగాహన ఉంటే తను అనవసరంగా ఇతరులు చెప్పే పనికి Ok చెప్పాడు. ఎందుకనగా అవతల వాళ్ల మీదా గౌరవంతో, ప్రేమ తో వాళ్ళు ఏదో పని అప్పజెప్పుతే సరే అని తీరా ఆ పని చెయ్యవలసి వచ్చినప్పుడు తనకి తన పనులు గుర్తుకురావడం, లేదా తనకి అప్పజెప్పిన పనిపై అవగాహన లేక పోవడం తిరిగి తను no అని చెప్పకపోవడం వాళ్ల తనే చిక్కు పరిస్థితులను తెచ్చిపెట్టుకుంటాడు.

ఒకవేళ తన మనస్తత్వం పై తనకి అవగాహన ఉంటే తను చేసే పని ఏమిటి అని కచ్చితంగా తెలుసుకొని తన వీలును బట్టి మాట ఇచ్చి ఒకవేళ విల్లేకుంటే no అని కచ్చితంగా చెప్పి చిక్కు పరిస్థితులను తెచ్చుకోడు.

మొత్తంగా తన లోపలి ఆలోచనల పట్ల, తన స్వభావం పట్ల తన మనస్తత్వం పట్ల తనకి ఒక కంప్లీట్ Self Awareness అనేది ఉండడం ద్వారా తన జీవితం కొంత మేరకు సులభంతరం అవుతుంది. అందువలన Self Awareness కలిగి ఉండటం ఉత్తమం. నీ Self Awareness నీ లోని ego నీ చూపుతుంది. నీ స్వార్ధని చూపుతుంది. నీ భయాన్ని చూపుతుంది. నీలో రగిలే ఎమోషన్నీ ఆ ఎమోషన్ ఏ రూపంలో ఉంటే దాన్ని చూపి ఆ ఎమోషన్ తో నువ్వు కొట్టుకుపోకుండా నిన్ను Balance గా ఒక స్థితప్రజ్ఞత గల వ్యక్తి గా నిన్ను తయారుచేస్తుంది.

Self Awareness ద్వారా నీ లో కలిగే ప్రతి ఆలోచనను నువ్వు ఒక సాక్షిగా గమనించినప్పుడు నువ్వు ఒక అబ్జర్వర్ లా గమనించినప్పుడు ఆ ఆలోచనలు నువ్వు కాదు నీలో నిత్యం జరిగే ఒక సంఘర్షణ అని నువ్వూ తెలుసుకుంటావు. ఆ ఆలోచనలు ఎప్పుడూ ఏం కోరుకుంటున్నాయో నువ్వు గమనించినప్పుడు నువ్వు ఒక ఆలోచనల వలయం లో చిక్కుకున్నావు అని తెలుస్తుంది.

చుట్టూ చెత్త వుంటే ఈగలు ఎలా ముసురుతాయో నీలో చెత్త వుంటే ఆలోచనలు కూడా నీలో అలాగే ముసురుతాయి. ఈగలు ముసరకుండా ఉండాలంటే చెత్త ఎలా clean చెయ్యాలి . మరి నీలో ఆలోచనలు ఈగల్లా ముసరకుండా ఉండాలి అంటే నీలోని చెత్త ఏంటో కనిపెట్టు నీ సెల్ఫ్ నీ free గా ఏ బరువు లేకుండా తేలిగ్గా పెట్టుకొనే మార్గం చూడు ఇప్పుడు అది నీకు చాలా అవసరం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *